Header Banner

ఈ జిల్లా ప్రజలకు భారీ శుభవార్త.. ఎంపీ నిరంతర కృషికి ఫలితం! ఈ సేవ త్వరలోనే అమలులోకి..

  Sun Apr 20, 2025 21:02        Politics

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నిరంతర కృషికి ఫలితం దక్కింది. అనంతపురం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. అనంతపురం రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే మొట్టమొదటి రైలు.. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - బెంగళూరు MEMU రైలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం సామాన్య ప్రజల అనేక సంవత్సరాల కోరికకు భారత రైల్వే శాఖ స్పందించింది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సుస్థిర నిర్ణయం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషితో సాధ్యమైంది. ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేసి అనేకసార్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) , దక్షిణ పశ్చిమ రైల్వే (SWR) జనరల్ మేనేజర్లను కలిసి, పుట్టపర్తి-బెంగళూరు రైలును అనంతపురం వరకు పొడిగించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ వీరన్న సోమన్నని వ్యక్తిగతంగా కలుసుకొని, ఆయన్ను ఈ అంశంలో జోక్యం చేసుకుని పుట్టపర్తి - బెంగుళూరు రైలును అనంతపురం వరకు పొడిగించాలని కోరారు.

 

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!

 

వారి సహకారంతో, రెండు రైల్వే జోన్లను ఒప్పించి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనంతపురం ప్రజలకు రైలు సౌకర్యాన్ని పూర్తిగా అందజేయగలిగారు. ఈ పొడిగింపు వల్ల ఇకపై అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు సులభంగా ప్రయాణించవచ్చు. ఇది సామాన్య ప్రయాణికుల మాత్రమే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఇప్పటి వరకు ఉన్న స్టాపేజ్ తో పాటు సోమేశ్వర, విధురాస్వర్థం, కొత్తచెరువు, బాసంపల్లె, చిగిచెర్ల, జంగలపల్లె, ప్రసన్నాయనపల్లి స్టేషన్లు లో కూడా ఈ రైలు స్టాపింగ్ సదుపాయం ఇస్తూ ఈ పొడిగింపు ప్రయాణ మార్గంలో కలపారు. ఈ రైలు పొడిగింపు అనంతపురం జిల్లాకు ఆర్థిక, సామాజిక ప్రగతికి ఊతమిచ్చే నిర్ణయం కావడమే కాకుండా, రవాణా అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భారత ప్రభుత్వ రైల్వే శాఖకు, రైల్వే అధికారులకు, కేంద్ర సహాయ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ - అతి త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రి చేతుల మీదుగా ఈ సేవ త్వరలోనే అమలులోకి రానుందని తెలిపారు. ఈ రైలు అనంతపురం స్టేషన్ నుండి మధ్యాహ్నం గం 2.10 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు బెంగళూరు స్టేషన్ చేరుకుంటుంది.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations